అసిస్టెంట్ ద్వారా లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
నాంపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):
నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటున్న ఆర్ఐ గోపరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.మండలానికి చెందిన ఓ రైతు పౌతి (పట్టా మార్పిడి) పనిమీద ఆర్ఐను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలో ఆర్ఐ తన అసిస్టెంట్ యాదగిరి ద్వారా రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.ఆర్ఐ గోపరాజుతో పాటు అసిస్టెంట్ యాదగిరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ అధికారుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

