Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఆదిలాబాద్ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. SNCUలో శిశువుల భద్రతపై సమీక్ష: మంత్రి దామోదర రాజనర్సింహ

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. SNCUలో శిశువుల భద్రతపై సమీక్ష: మంత్రి దామోదర రాజనర్సింహ

📰 Generate e-Paper Clip

• ప్రమాదం అనంతరం రెస్క్యూ, రిలీఫ్‌ చర్యల పరిశీలన..
• శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్ష..
• భవిష్యత్తులో ఘటనలు పునరావృతం కాకుండా ఫైర్‌ సేఫ్టీపై దృష్టి..
ప్రజాసంక్షేమం న్యూస్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్‌ రిమ్స్‌ హాస్పిటల్‌లోని స్పెషల్‌ నియోనాటల్‌ కేర్‌ యూనిట్‌ (SNCU)లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన రెస్క్యూ, రిలీఫ్‌ చర్యలను పరిశీలించి, SNCUలో చికిత్స పొందుతున్న శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించిన విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షించి, మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదంతో ఆందోళనకు గురైన చిన్నారుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.రిమ్స్‌లోని ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర సమయంలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష కొనసాగుతోంది.ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.శిశువుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.