Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణదసరాలోపు యాదాద్రి థర్మల్‌ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి:

దసరాలోపు యాదాద్రి థర్మల్‌ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి:

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. జీ-9 బొగ్గు కోసం కేంద్రంతో తక్షణ చర్చలు
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్
:దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో యాదాద్రి థర్మల్ కేంద్రం పనితీరుపై సీఎం ఆరా తీశారు.
🔹జీ-9 బొగ్గు కోసం కేంద్రంతో చర్చలు:
యాదాద్రి థర్మల్ కేంద్రానికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు సింగరేణిలో అందుబాటులో లేదని అధికారులు వివరించారు. సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ-9 బొగ్గు లభించే అవకాశం లేదని తెలిపారు. దీంతో జీ-9 బొగ్గు లభ్యతపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో తక్షణమే చర్చించాలని సీఎం, డిప్యూటీ సీఎంకు సూచించారు.
🔹రూ.40 వేల కోట్ల అదనపు భారం:
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను బొగ్గు గనుల సమీపంలోని పిట్‌హెడ్ ప్రాంతంలో కాకుండా దూరంగా నిర్మించడం వల్ల బొగ్గు రవాణా ఖర్చుతో రాష్ట్రంపై దాదాపు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు సమావేశంలో వెల్లడించారు. జీ-9 బొగ్గుపై ఆధారపడే విధంగా ప్లాంట్‌ను నిర్మించడంపై సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించారు.
🔹ఇతర సంస్థల నుంచి బొగ్గు కొనుగోలు:
రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని అధికారులు తెలిపారు.
🔹ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యుత్:
ఎత్తిపోతల పథకాల పంపులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు ఇంధన శాఖ, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.