Wednesday, October 14, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకేదారి దంపతుల కుటుంబానికి రూ.10 లక్షల CMRF సాయం:ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

కేదారి దంపతుల కుటుంబానికి రూ.10 లక్షల CMRF సాయం:ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్-హనుమకొండ:తెలంగాణ మలిదశ ఉద్యమంలో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఉద్యమ సమయంలో కేదారి దంపతులు హోటల్ నిర్వహిస్తూ ఉద్యమకారులకు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీ అందించారు.ఇటీవల విషాదకర ఘటనలో కేదారి సెప్టెంబర్ 9న, పుష్పలత సెప్టెంబర్ 10న మృతి చెందారు. వారి సేవలను గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మంజూరైన మొత్తాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.