రూ.55,116లకు లడ్డూను దక్కించుకున్న BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్
రామన్నపేట, (ప్రజా సంక్షేమం న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో,వైభవంగా ముగిశాయి.ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ గణేష్ స్వామివారి పవిత్ర లడ్డూ వేలం పాట గ్రామస్తులు,భక్తుల ఉత్సాహం మధ్య ఘనంగా జరిగింది.ఈ వేలం కార్యక్రమంలో నల్లగొండ జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడు శ్రీ కంబాలపల్లి సతీష్ యాదవ్ పాల్గొని,వేలం పాటలో ఉత్సాహంగా పాల్గొని రూ.55,116/-లకు గణేష్ లడ్డూను దక్కించుకున్నారు.
లడ్డూను దక్కించుకున్న సతీష్ యాదవ్‌ను హనుమాన్ యూత్ సభ్యులు,గ్రామస్తులు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి,స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,జనంపల్లి గ్రామం సుఖసంతోషాలతో,సకల శుభాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.గణేష్ లడ్డూను దక్కించుకుని ఉత్సవాల్లో భాగస్వామ్యమైన కంబాలపల్లి సతీష్ యాదవ్‌కు జనంపల్లి హనుమాన్ యూత్ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు,హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు,యువత, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
— ప్రజా సంక్షేమం న్యూస్
ప్రజల గొంతుక • ప్రజా సమస్యల వేదిక
జనంపల్లిలో ఘనంగా గణేష్ లడ్డూ వేలం!
RELATED ARTICLES

