Monday, October 12, 2026
prajasamkshemam news
Homeక్రీడలుతెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాల పంట

తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాల పంట

📰 Generate e-Paper Clip

8వ బెటాలియన్ ఆర్‌ఐ నోముల నర్సయ్యకు మూడు పతకాలు
గోల్డ్ మెడల్‌తో పాటు రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన నర్సయ్య
అభినందనలు తెలిపిన 8వ బెటాలియన్ కమాండెంట్ డి.
శివప్రసాద్ రెడ్డి
రామన్నపేట, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్:
తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన 5వ తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 8వ బెటాలియన్ ఆర్‌ఐ నోముల నర్సయ్య అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించారు.టెన్నిస్‌లో 50 ఏళ్లు పైబడిన వారి విభాగం డబుల్స్‌లో గోల్డ్ మెడల్, సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే 40 ఏళ్లు పైబడిన వారి విభాగం డబుల్స్‌లో మరో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. మూడు పతకాలు సాధించి 8వ బెటాలియన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.ఈ సందర్భంగా 8వ బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి నోముల నర్సయ్యను హృదయపూర్వకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నర్సయ్యకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.మూడు పతకాలు సాధించిన నోముల నర్సయ్య స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం కావడం విశేషం. ఆయన విజయంపై గ్రామస్థులు, పోలీసు సిబ్బంది, బెటాలియన్ అధికారులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.