మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం,మందుల సామేలు..కుటుంబ సభ్యులకు పరామర్శ.
ప్రజాసంక్షేమం న్యూస్- కేతపల్లి:
కేతపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన సుంకరి కేశయ్య పాము కాటుకు గురై మృతి చెందారు.విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు బొప్పారం గ్రామానికి చేరుకుని కేశయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.కేశయ్య మృతి పట్ల గ్రామంలో విషాదం నెలకొంది.
పాము కాటుతో విషాదం.. సుంకరి కేశయ్య మృతి.
RELATED ARTICLES

