కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సాయం.. 50 కిలోల బియ్యం అందజేత
ప్రజాసంక్షేమం న్యూస్ ఆత్మకూరు, సెప్టెంబర్ 20:
ఆత్మకూరు మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ యక్షగాన కళాకారుడు గడ్డం రామనర్సయ్య అకాల మృతి పట్ల సిపిఎం గ్రామ శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన భౌతికకాయానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు గడ్డం పాండురంగానికి సిపిఎం గ్రామ శాఖ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. అలాగే గ్రామ ఉపసర్పంచ్ హన్మంతుల రమేష్ బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ,జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు, సంగీత దర్శకుడు మద్దూరి ఐలయ్య, దేశపాక రవి,సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం, శాఖ కార్యదర్శి తుమ్మలగూడెం యాదయ్య, గ్రామ ఉపసర్పంచ్ హన్మంతుల రమేష్, మాజీ ఉపసర్పంచ్ మరిపల్లి మల్లయ్య, సిపిఎం నాయకులు భాషబోయిన బుగ్గయ్య పాల్గొన్నారు.అలాగే బండ బీరయ్య, కూరెళ్ల నాగయ్య, మారుపాక యాదయ్య, నార్కట్‌పల్లి మల్లయ్య, బాషబోయిన ఐలయ్య, వనం బక్కమ్మ, నార్కట్‌పల్లి లక్ష్మి, ప్రజానాట్యమండలి కళాకారులు గుండ నర్సింహ, పండుగు రాజమల్లు, మేడి పృథ్వి తదితరులు పాల్గొని గడ్డం రామనర్సయ్యకు అంజలి ఘటించారు.
యక్షగాన కళాకారుడు గడ్డం రామనర్సయ్య మృతి పట్ల సిపిఎం సంతాపం!
RELATED ARTICLES

