Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణవర్షాభావ పరిస్థితులపై కేంద్ర సహకారం కోరిన సీఎం:

వర్షాభావ పరిస్థితులపై కేంద్ర సహకారం కోరిన సీఎం:

📰 Generate e-Paper Clip

ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం!
మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి!
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతిపత్రాన్ని అందజేతా…
ప్రజా సంక్షేమం న్యూస్-హైదరాబాద్
:
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు,వ్యవసాయ రంగంపై వాటి ప్రభావాన్ని ఆయనకు వివరించారు.మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు,ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేంద్రానికి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని సీఎం తెలిపారు.తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు.ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు.పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కోరారు.ఇందులో భాగంగా 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు,కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
9.56 లక్షల ఇళ్లకు విజ్ఞప్తి:
PMAY-G పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని గత జూలైలో ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించిన విషయాన్ని గుర్తుచేశారు.రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
సన్నబియ్యం,సన్న వడ్లకు ప్రోత్సాహం:
రాష్ట్రంలో పేదలకు రేషన్‌ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం వివరించారు. అలాగే సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.