ప్రజాసంక్షేమం న్యూస్-ఖమ్మం:
చర్ల మండలం సత్యనారాయణపురంలోని ఐటీడీఏ ఎస్టీ బాలుర హాస్టల్‌లో కుక్‌గా పనిచేస్తున్న ఉద్యోగి జీతం చెల్లించేందుకు ₹14 వేల లంచం డిమాండ్ చేసిన వార్డెన్ భూక్యా వాల్ సింహ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో,డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి నిర్వహించి లంచం తీసుకుంటున్న వార్డెన్‌ను పట్టుకున్నట్లు సమాచారం.ఘటనపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.

