Thursday, October 15, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకేసీఆర్ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తారంటున్న కేటీఆర్‌.. కానీ కేసీఆర్‌ మాత్రం బయటకు వచ్చేది లేదంటున్నారు:...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తారంటున్న కేటీఆర్‌.. కానీ కేసీఆర్‌ మాత్రం బయటకు వచ్చేది లేదంటున్నారు: వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

**కేసీఆర్‌ పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేదు**
**సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌పై ప్రజలకు విశ్వాసం ఉంది**

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అందిస్తోందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వస్తారని కేటీఆర్‌ చెబుతుంటే, కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌ వదిలి బయటకు వచ్చేది లేదని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కేసీఆర్‌ పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని వేముల వీరేశం పేర్కొన్నారు. గత పాలనపై ప్రజలు అసంతృప్తితోనే మార్పును కోరుకున్నారని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, విజన్‌పై ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడం, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల విశ్వాసమే తమ బలమని, ప్రజా సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని వేముల వీరేశం పేర్కొన్నారు.
**PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్**

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.