ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, జన్నపాల శ్రీను, మాజీ ఎంపీటీసీ పోలగొని స్వామి, చెరుకు సైదులు, పాకాల దినేష్, పొలగొని నరసింహ, మేడబోయిన శ్రీను, బోయ స్వామి, బోయ లక్ష్మయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
RELATED ARTICLES

