Wednesday, October 14, 2026
prajasamkshemam news
Homeతెలంగాణపేద కుటుంబానికి CMRF అండ: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

పేద కుటుంబానికి CMRF అండ: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

నరేష్‌కు రూ.2.50 లక్షల LOC చెక్కు అందజేత
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సింగనబోయిన నరేష్‌కు రూ.2.50 లక్షల విలువైన LOC చెక్కును అందజేశారు.ఇటీవల ప్రమాదానికి గురై అనారోగ్యంతో బాధపడుతున్న నరేష్‌కు అత్యవసర వైద్య చికిత్స కోసం నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లా నాయకుడు పూస బాలకిషన్ సహకారంతో మంజూరైన చెక్కును హైదరాబాద్‌లోని తన ఛాంబర్‌లో నరేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వేముల వీరేశం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరేష్ కుటుంబానికి గతంలో కూడా రెండు పర్యాయాలు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్స సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థికంగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేద ప్రజలకు సహాయం అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.