Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణమర్రిగూడలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

మర్రిగూడలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం
మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్
మర్రిగూడ, అక్టోబర్ 31 (ప్రజా సంక్షేమం న్యూస్):

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మర్రిగూడ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేతరీ యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, వెంకటపేట బాలయ్య, ఉపాధ్యక్షుడు జంగిలి రవి, ప్రధాన కార్యదర్శి రావుల రాములు, హైతాపాక జంగయ్య, కార్యదర్శి ఈదగోని వెంకటేష్, గ్యారి యాదయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.డి. హష్వక్, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు రేణుక, వెంకన్న, లపంగి నరసింహ, సిరసవాడ బుక్షం, జిల్లా కృష్ణయ్య, గుణిగంటి నరసింహతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.