Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసింగీతం శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

సింగీతం శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

వైవిధ్యభరిత చిత్రాలతో ప్రత్యేక ముద్ర

తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడు

కుటుంబ సభ్యులు, అభిమానులకు సీఎం ప్రగాఢ సానుభూతి

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు చిత్రపరిశ్రమతో పాటు భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.వైవిధ్యమైన కథాంశాలు, వినూత్న ఆలోచనలను తెరపై ఆవిష్కరిస్తూ తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన సృజనాత్మక దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు సేవలను సీఎం స్మరించుకున్నారు. ప్రయోగాత్మకతకు పెద్దపీట వేస్తూ ఎన్నో చిరస్మరణీయ చిత్రాలను అందించి సినీ చరిత్రలో తనదైన ముద్రను శాశ్వతంగా వేసుకున్నారని అన్నారు.దర్శకుడిగానే కాకుండా రచయితగా, ఆలోచనాపరుడిగా, సినిమాపై అపారమైన ప్రేమతో పనిచేసిన కళాకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సీఎం పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ కళాభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.