నార్కట్‌పల్లి,ఎల్లారెడ్డిగూడెంలో లబ్ధిదారులకు కళ్లజోళ్లు అందజేత
సర్జరీ అవసరమైన వారికి హైదరాబాద్‌లో ఉచిత శస్త్రచికిత్స
నియోజకవర్గవ్యాప్తంగా కొనసాగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు
ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్: పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఉద్దీపన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు,కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా నార్కట్‌పల్లి పట్టణం,ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై కంటి పరీక్షలు చేయించుకున్న లబ్ధిదారులకు స్వయంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేద ప్రజలకు కంటి వెలుగు అందించాలనే సంకల్పంతో ఉద్దీపన సంస్థ ద్వారా తన సొంత నిధులతో ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్న వారికి ప్రస్తుతం కళ్లజోళ్లు అందిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా కంటి శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించి హైదరాబాద్‌కు తరలించి ఉచితంగా సర్జరీ చేయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో ఉద్దీపన సంస్థ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉద్దీపన ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీచేసిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే!
RELATED ARTICLES

