Tuesday, October 13, 2026
prajasamkshemam news
HomeతెలంగాణSIR రద్దు చేయాలి.. ఓటు హక్కును కాపాడాలి

SIR రద్దు చేయాలి.. ఓటు హక్కును కాపాడాలి

📰 Generate e-Paper Clip

రాహుల్ గాంధీ,జెన్-జీ యువత ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
హైదరాబాద్, అక్టోబర్ 8, ప్రజా సంక్షేమం న్యూస్:
ఎన్నికల కమిషన్‌ను తొలగించాలని, SIR (Special Intensive Revision) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, జెన్-జీ యువత చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ కొనసాగగా “STOP Vote Chori”, “Scrap SIR”, “Save Democracy” అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. SIR పేరుతో పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.EVMలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం కలిగించేలా ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. SIR విధానాన్ని రద్దు చేసి, ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని వేముల వీరేశం స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.