Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట! నల్గొండ మేయర్ బుర్రి చైతన్య

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట! నల్గొండ మేయర్ బుర్రి చైతన్య

📰 Generate e-Paper Clip

సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్):

నల్లగొండ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని 2, 18, 19, 22వ డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ డ్రైనేజీలు, బీటీ రోడ్ల పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా 18వ డివిజన్‌లోని ఎన్‌హెచ్ డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల పరిస్థితిని పరిశీలించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.నగరంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.