Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeజాతీయంఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే ప్రధాన కార్యదర్శి గా విజ్జు కృష్ణన్!

ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే ప్రధాన కార్యదర్శి గా విజ్జు కృష్ణన్!

📰 Generate e-Paper Clip

36వ జాతీయ మహాసభల ముగింపు..
నల్గొండ వేదికగా ఏఐకేఎస్ నూతన జాతీయ నాయకత్వం ఎన్నిక!
కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నిక..
తెలంగాణకు ఎనిమిది మందికి ప్రాతినిధ్యం…
ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి అవకాశం..
నల్గొండ, నవంబర్ 18 (ప్రజా సంక్షేమం న్యూస్):

అఖిల భారత కిసాన్ సభ (AIKS) నూతన జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజూ కృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారు. నల్గొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌లో నాలుగు రోజులపాటు ఉత్సాహభరితంగా జరిగిన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు బుధవారం నూతన జాతీయ కమిటీ ఎన్నికతో ముగిశాయి.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అశోక్ ధావలే ప్రధాన కార్యదర్శి పదవికి విజూ కృష్ణన్ పేరును ప్రతిపాదించగా, ఎంపీ అమ్రా రామ్ బలపరిచారు. హన్నన్ మొల్లా నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో విజూ కృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మహాసభలో 167 మందితో అఖిల భారత కిసాన్ కౌన్సిల్ (AIKC) ఏర్పాటు చేయగా, అందులో నుంచి 86 మందితో కేంద్ర కిసాన్ కౌన్సిల్ (CKC)ను, 27 మందితో జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.నూతన ఉపాధ్యక్షులుగా హన్నన్ మొల్లా, అమ్రా రామ్, ఈపీ జయరాజన్, అమల్ హల్దర్, ఎం. విజయ్ కుమార్, ఎస్.కె. ప్రీజా ఎన్నికయ్యారు.సంయుక్త కార్యదర్శులుగా పి. కృష్ణ ప్రసాద్, అవధేశ్ కుమార్, మరియం ధావలే, కేఎన్ బాలగోపాల్, వల్సన్ పనోలి, అజిత్ నవలే, రతన్ దాస్, పరేష్ పాల్, టి. సాగర్, పొత్తినేని సుదర్శన్, స్వామి నటరాజన్, ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.
తెలంగాణకు ఎనిమిది మందికి ప్రాతినిధ్యం!
తెలంగాణ నుంచి టి. సాగర్, పొత్తినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బి. రాంబాబు, పి. జంగారెడ్డి, కందాల ప్రమీల, మూడ్ శోభన్ అఖిల భారత కిసాన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. వీరిలో టి. సాగర్, పొత్తినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి కేంద్ర కిసాన్ కౌన్సిల్‌లో స్థానం సంపాదించారు. టి. సాగర్, పొత్తినేని సుదర్శన్ కార్యవర్గ బాధ్యతలకు ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి అవకాశం!
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభాకర్ రెడ్డి, వి. కృష్ణయ్య, సూర్యనారాయణ, ఎం. హరిబాబు, బి. బలరాం అఖిల భారత కిసాన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. వీరిలో ప్రభాకర్ రెడ్డి, కృష్ణయ్య, ఎం. హరిబాబు కేంద్ర కిసాన్ కౌన్సిల్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రభాకర్ రెడ్డి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.రైతాంగ హక్కులు, వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నూతన జాతీయ నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. నల్గొండలో విజయవంతంగా ముగిసిన 36వ జాతీయ మహాసభలు రైతాంగ ఉద్యమానికి నూతన ఉత్సాహాన్ని అందించాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.