Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఈత చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

ఈత చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

కాలు, వెన్నుపూస విరిగి ఆసుపత్రిలో చికిత్స.. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు
మునుగోడు,నవంబర్ 25(ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి):
మునుగోడు మండలం చోల్లేడు గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొడ్డు నరసింహ (45) ఈత చెట్టు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నవంబర్ 23న సాయంత్రం 5:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.రోజువారీ పనిలో భాగంగా కల్లు తీసేందుకు ముస్తాదు మోకు సహాయంతో ఈత చెట్టు ఎక్కిన నరసింహ ప్రమాదవశాత్తు మోకు జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలు, వెన్నుపూస విరిగినట్లు సమాచారం.నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన నరసింహ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.కుటుంబానికి జీవనాధారమైన నరసింహ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి బాధిత గీత కార్మికుడికి తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.