ప్రారంభించిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల:చిట్యాల మండలం వట్టిమర్తి స్టేజి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ లేలాండ్ అథరైజ్డ్ సర్వీసింగ్ అండ్ స్పేర్ పార్ట్స్ పాయింట్‌ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్వీసింగ్ పాయింట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సర్వీసింగ్ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలోని లారీ యజమానులకు, డ్రైవర్లకు నాణ్యమైన సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.అదేవిధంగా ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆకాంక్షించారు. ప్రాంతీయంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందడానికి ఇలాంటి సంస్థలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తిలో అశోక్ లేలాండ్ సర్వీసింగ్ పాయింట్ ప్రారంభం
RELATED ARTICLES

