Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుతెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం!

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం!

📰 Generate e-Paper Clip

వెబ్‌సైట్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ నిర్ణయం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మినిస్టర్ క్వార్టర్స్‌లోని నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించి, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిపై సమీక్షించింది.కమిటీ చైర్మన్ కే. కేశవరావు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.వివిధ యూనివర్సిటీల ఉద్యమకారులు, కళాకారులు,సబ్బండ వర్గాల ప్రతినిధులతో ఇప్పటికే జరిపిన సంప్రదింపులు,వారి అభిప్రాయాలు,సూచనలు, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలపై సమాలోచనలు చేశారు.ఉద్యమకారుల వివరాల నమోదు, గుర్తింపు కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న వెబ్‌సైట్ ప్రస్తుత స్థితిని సమీక్షించారు.వెబ్‌సైట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు కమిటీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు.వెబ్‌సైట్ ఏర్పాటుపై తదుపరి పురోగతిని త్వరలో సమీక్షించి, దాని ప్రారంభ తేదీతో పాటు గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.