Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనూతన చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నూతన చేయూత పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

నకిరేకల్, నవంబర్ 15, ప్రజా సంక్షేమం న్యూస్:నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన చేయూత పింఛన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేదలు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.నూతనంగా పింఛన్లు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.