నిర్ణీత గడువులో నిర్మాణాలు పూర్తి చేయాలి – అధికారులకు ఆదేశాలు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:కరీంనగర్, జనగాం, సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి హాస్టళ్ల నిర్మాణ పనులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య రంగంలో మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఎంఈ డాక్టర్ వాణి, ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

