Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ:

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ:

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్- మర్రిగూడ,
మర్రిగూడ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మొత్తం రూ.9,54,500 విలువైన చెక్కులను లబ్ధిదారులకు మర్రిగూడ మండల కాంగ్రెష్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ అందజేశారు.ఈ సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ మంజూరు చేయడంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల మాజీ జెడ్పీటీసీ మేతరి జాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్,సర్పంచులు ఐతగోని రేణుక గౌడ్ వెంకన్న,లపంగి నరసింహ,సిరసనవాడ భిక్షమయ్య, జిల్లా అలివేలు కృష్ణయ్య, రమావత్ లక్ష్మణ్,విజయలక్ష్మి, గునుగంటి సంగీత,నరసింహ,మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కోడల అల్వాల్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసా శేఖర్, వెంకటంపేట బాలయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, జంగిలి రవి, బాయికాడి కొండల్, ఉడుగు శ్రీను, జాల వెంకటయ్య, కొలుకులపల్లి జంగయ్య, ఉడుగు అంజయ్య, సిరిపంగి శ్రీను, పోనుగోటి శేఖర్, ఇదగోని కృష్ణయ్య, గ్యార వెంకటేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.