Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసూర్యాపేటలో ‘స్వచ్ఛతా హి సేవా – 2026’ పోస్టర్ ఆవిష్కరణ

సూర్యాపేటలో ‘స్వచ్ఛతా హి సేవా – 2026’ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్-సూర్యాపేట:
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన‘స్వచ్ఛతా హి సేవా – 2026’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ “స్వచ్ఛతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరం.’మన ఊరు – మన పరిశుభ్రత’అనే భావనతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములు కావలసిందిగా పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేస్తూ ‘వికసిత భారత్’సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.అదనపు కలెక్టర్ బి.హరీసింగ్ ఆర్‌డీవో ఆర్.సన్యాసయ్య జెడ్పీ సీఈవో డి.శిరీష డీపీవో కె.యాదగిరి స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్లు ఎన్.నరేందర్ రెడ్డి,ఆర్.హరి తదితరులు పాల్గొన్నారు.పరిశుభ్రమైన సూర్యాపేట జిల్లా నిర్మాణానికి పౌరులందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా అధికారులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.