మన్మోహన్ సింగ్ స్మారక పార్క్, విగ్రహం ఆవిష్కరన
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఘనంగా కార్యక్రమం
పలువురు మంత్రులు,న్యాయమూర్తులు,ప్రజాప్రతినిధుల హాజరు
హైదరాబాద్, సెప్టెంబర్ 27:భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త,మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన స్మారక పార్క్,విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.విప్రో సర్కిల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌లో ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న మన్మోహన్ సింగ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మార్పులు తీసుకొచ్చారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని కార్యక్రమంలో పాల్గొన్న వారు గుర్తు చేసుకున్నారు.ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్,సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ,సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి,ఆర్థిక మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎంపీలు వేం నరేందర్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ,నవీన్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు: ముఖ్యమంత్రి
RELATED ARTICLES

