అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు
22A సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (ప్రజాసంక్షేమం న్యూస్):
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అర్హత కలిగిన కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించి క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.గతంలో ULC కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి జీవోలు జారీ చేసినప్పటికీ వాటి అమలు జరగకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో భూముల హక్కులు, రిజిస్ట్రేషన్లు, లావాదేవీల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
ULC దరఖాస్తులపై స్పష్టమైన ఉత్తర్వులు
గతంలో జారీ చేసిన GO నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ ULC దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా Memo.No.48062/ULC/A1/2026-1 జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
22A సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారంసెక్షన్ 22Aతో ముడిపడి ఉన్న కీలక భూ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు GO 118, GO 76కుఅనుగుణంగా మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 22A పరిధిలో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు.తాజాగా ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా మరో కీలక సమస్యకు పరిష్కారం చూపినట్లు మంత్రి తెలిపారు.ప్రజల భూ సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మిగిలిన 22A సమస్యలను కూడా వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం
RELATED ARTICLES

