Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనల్గొండపత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేయాలి:కలెక్టర్ బి.చంద్రశేఖర్

పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం చేయాలి:కలెక్టర్ బి.చంద్రశేఖర్

📰 Generate e-Paper Clip

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్ బి.చంద్రశేఖర్
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:2026–27 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మార్కెటింగ్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి మద్దతు ధర, కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సుమారు 5,93,795 ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని, దాదాపు 3,56,257 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనికి అనుగుణంగా కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం 26 జిన్నింగ్ మిల్లులు ఉండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాలుకు రూ.8,667 చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 శాతం వరకు ఉంటే పూర్తి మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు.ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కిసాన్ కపాస్ యాప్, పత్తి నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల వివరాలు, కొనుగోలు జరిగే రోజులు, సెలవు రోజులపై వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి రైతుకు ముందుగానే సమాచారం అందించాలని సూచించారు.ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద నెల రోజుల కొనుగోలు షెడ్యూల్, మద్దతు ధర, తేమ శాతం తదితర వివరాలను ఫ్లెక్సీల ద్వారా స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు.జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి ప్రైవేట్‌గా పత్తిని కొనుగోలు చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలని కలెక్టర్ కోరారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మానవతా దృక్పథంతో రైతులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా CCI అధికారులు కూడా పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.