**రోజుకు 3,000 మంది రోగులకు వైద్య సేవలు**
** ప్రజాసంక్షేమం న్యూస్ వరంగల్:** వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా నాటికి ఓపీ సేవలు ప్రారంభించేందుకు మొదటి దశ పనులు పూర్తయ్యాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20 నుంచి రోజుకు 3,000 మంది రోగులకు ఓపీ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్య శారద, NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
**PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్**
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీ సేవలు
RELATED ARTICLES

