Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఈ నెల 28న నల్గొండకు మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

ఈ నెల 28న నల్గొండకు మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

📰 Generate e-Paper Clip

ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 10.15 నుంచి సాయంత్రం 6.30 వరకు ఫిర్యాదుల స్వీకరణ
నల్గొండ, అక్టోబర్ 24 (ప్రజా సంక్షేమం న్యూస్):
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ నెల 28న నల్గొండ జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులను సందర్శించనున్నారు.
పర్యటన సమయాలు:
– ఉదయం 8.15 గంటలకు: హైదరాబాద్ నుంచి బయలుదేరడం.
– ఉదయం 10.15 గంటలకు: నల్గొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకోవడం.
– ఉదయం 10.15 నుంచి సాయంత్రం 6.30 వరకు: గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రుల సందర్శన.
– సాయంత్రం 6.30 గంటలకు: నల్గొండ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.
మానవ హక్కులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు ఉన్నవారు ఈ నెల 28న నల్గొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చైర్‌పర్సన్‌కు నేరుగా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.