జలసిరి కార్యక్రమంలో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు
నకిరేకల్: ప్రజా సంక్షేమం న్యూస్:
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిస్తామని,ప్రతి నీటి బొట్టును సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. వీరితో పాటు ఉరుమడ్ల గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.నీటి వనరులను కాపాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రజలందరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి నివారణకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలి!
RELATED ARTICLES

