Monday, October 12, 2026
prajasamkshemam news
Homeక్రైమ్తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైరు.. యువ కూలీ మృతి

తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైరు.. యువ కూలీ మృతి

📰 Generate e-Paper Clip

పురుగుమందు పిచికారీ చేస్తుండగా విద్యుత్ షాక్
27 ఏళ్ల యువకుడి విషాదాంతం.. కుటుంబ సభ్యుల కన్నీరుమున్నీరు
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
నిడమానూరు, సెప్టెంబర్ 28 (ప్రజా సంక్షేమం న్యూస్):

నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గుంటిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగ తగిలి ఓ యువ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.గుంటిపల్లి గ్రామానికి చెందిన నల్లగంతుల నాగరాజు (27) రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో నివాసముంటున్న నాగరాజు, ప్రతిరోజూ పనుల నిమిత్తం తన స్వగ్రామానికి వచ్చి కూలీ పనులు ముగించుకుని తిరిగి వెళ్లేవాడు.ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో గుంటిపల్లి పరిధిలోని ఓ రైతు పొలంలో పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అయితే పొలంలో అప్పటికే ప్రమాదకరంగా 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడి ఉన్నట్లు సమాచారం. ఇది గమనించని నాగరాజు పిచికారీ చేస్తుండగా విద్యుత్ తీగపై కాలు వేయడంతో ఒక్కసారిగా తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.చేతికందిన వయసులో ఉన్న 27 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యుత్ తీగ తెగిపడి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ స్థానికులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.