Monday, October 12, 2026
prajasamkshemam news
Homeక్రీడలుతైక్వాండోలో రాణించి సీఎం కప్‌లో మెడల్స్ సాధించాలి

తైక్వాండోలో రాణించి సీఎం కప్‌లో మెడల్స్ సాధించాలి

📰 Generate e-Paper Clip

ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులకు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపు
శారీరక,మానసిక దారుఢ్యానికి తైక్వాండో దోహదం
క్రీడాకారులు కష్టపడి సాధన చేయాలని సూచన
నల్గొండ,సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):

ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో నిర్వహించే సీఎం కప్‌లో మెడల్స్ సాధించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పాత గ్రామర్ స్కూల్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడి శిక్షణ వివరాలను తెలుసుకున్నారు.నల్గొండ,యాదాద్రి భువనగిరి,సూర్యాపేట జిల్లాల నుంచి సుమారు 200 మంది బాలురు, 100 మంది బాలికలు శిక్షణలో పాల్గొంటున్నారని జిల్లా క్రీడలు అభివృద్ధి అధికారి అక్బర్ అలీ కలెక్టర్‌కు వివరించారు.వివిధ కేటగిరీలకు చెందిన క్రీడాకారులు ఈ శిక్షణలో పాల్గొంటున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర క్రీడలతో పోలిస్తే తైక్వాండో ప్రత్యేకమైన క్రీడ అని, ఇది క్రీడాకారుల్లో శారీరక, మానసిక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ తీసుకుని పోటీలకు సిద్ధం కావాలని సూచించారు.అన్ని స్థాయిల్లో ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించడంతో పాటు రాష్ట్రస్థాయిలో జరిగే సీఎం కప్‌లోనూ పతకాలు సాధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.