Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందించడమే లక్ష్యం.యంఎల్ఎ

అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందించడమే లక్ష్యం.యంఎల్ఎ

📰 Generate e-Paper Clip

ప్రజాసంక్షేమం న్యూస్ హాలియా:
పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో లబ్ధిదారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, సర్పంచులు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.