Thursday, November 12, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుఅర్హులైన కళాకారులకు సంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలి: పందిరి సైదులు

అర్హులైన కళాకారులకు సంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలి: పందిరి సైదులు

📰 Generate e-Paper Clip

కళాకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
నవంబర్ 9, ప్రజా సంక్షేమం న్యూస్ – మునుగోడు ప్రతినిధి:

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవి, కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న డిమాండ్ చేశారు.మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు గత ప్రభుత్వాలు కవి, కళాకారులను అన్ని విధాలుగా వినియోగించుకుని, అనంతరం వారి సమస్యలను పట్టించుకోకుండా మోసం చేశాయని విమర్శించారు. ప్రస్తుత ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని, వృద్ధాప్య కళాకారులకు పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం కాలయాపన చేయకుండా కళాకారుల సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. అర్హులైన కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాకారులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి తగిన విధంగా నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న, గద్దర్ ఉపాధ్యక్షుడు రడం నర్సింగ్ రావు, కోశాధికారి రాములు, సహాయ కార్యదర్శి మేడి సైదులు తదితర కళాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.