Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణచేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

మునుగోడు,నవంబర్ 18(ప్రజాసంక్షేమం న్యూస్–మండల ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పథకం ద్వారా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కొత్త పెన్షన్లు మంజూరు చేసింది.మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకరేకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో రత్తిపల్లి గ్రామానికి చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.గ్రామ సర్పంచ్ జిట్టగోని సైదమ్మ, సైదులు, పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మవానిక్ బిక్షం గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బొమ్మగోని నరసింహ, గాదె నరసింహ, బొలుగూరి లింగస్వామి, బొడ్డుపల్లి యాదయ్య, మాధగోని కలమ్మ, బొమ్మగోని రాధ, చల్లేటి పద్మజ తదితరులు పెన్షన్ మంజూరు పత్రాలను అందుకున్నారు.పెన్షన్లు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.