ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి బార్ అసోసియేషన్ వినతి
మిర్యాలగూడ, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):
మిర్యాలగూడ పట్టణంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి ఆరు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని ఎస్.వి. గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీకి వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం భవిష్యత్ అవసరాలకు సరిపోవడం లేదని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నూతన కోర్టు భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తే న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుకు వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి వినతిని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జంగిలి ఎల్లయ్య, జాయింట్ సెక్రటరీ రాయారపు భాస్కర్, కోశాధికారి రెడ్డపల్లి సైదులు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) గోదాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడలో నూతన కోర్టు భవనాలకు ఆరు ఎకరాల స్థలం కేటాయించాలి.
RELATED ARTICLES

