Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణహాలియా మున్సిపాలిటీలో SHG రుణాలపై వివాదం..

హాలియా మున్సిపాలిటీలో SHG రుణాలపై వివాదం..

📰 Generate e-Paper Clip

మహిళలకు తెలియకుండానే రుణం మంజూరైందా?
డబ్బులు అందలేదంటున్న బాధితులు
పూర్తి స్థాయి విచారణకు డిమాండ్
ప్రజాసంక్షేమం న్యూస్ హాలియా:
హాలియా మున్సిపాలిటీలో 10 మంది మహిళలకు సంబంధించిన స్వయం సహాయక సంఘం (SHG) రుణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తమకు తెలియకుండానే రుణం ఖాతాలో నమోదైందని, రుణానికి సంబంధించిన నగదు తమకు అందలేదని కొంతమంది మహిళలు ఆరోపిస్తున్నారు.SHG ఖాతాలో రుణం మంజూరైనట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ, NEFT/RTGS ద్వారా నగదు బదిలీ చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ తమకు మాత్రం డబ్బులు అందలేదని బాధిత మహిళలు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో రుణం ఎక్కడి నుంచి మంజూరైంది, నగదు ఏ ఖాతాకు బదిలీ అయింది, లబ్ధిదారులకు ఎందుకు అందలేదనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఈ వ్యవహారానికి సంబంధించి లోన్ ఖాతా నంబర్ 73071305178 చుట్టూ కూడా వివాదం నెలకొంది. మహిళల ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15 రోజుల్లో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, గడువు పూర్తయినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఇచ్చిన హామీ ఎందుకు అమలు కాలేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన డబ్బులు ఎక్కడికి వెళ్లాయి? రుణ ఖాతాలో నమోదైన లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? అనే అంశాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.రుణ మంజూరు నుంచి నగదు బదిలీ వరకు జరిగిన మొత్తం లావాదేవీలను పరిశీలించి, బాధిత మహిళలకు న్యాయం చేయాలని, బాధ్యులెవరైనా ఉంటే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.