ఓటరు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కీలకం
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు,రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన అన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకత, కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగేలా సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హత ఉన్నవారు తమ పేర్లను జాబితాలో పరిశీలించుకోవాలని ప్రోత్సహించాలన్నారు.ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన అంశమని, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడటంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం ముఖ్యమని దేవసేన స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన మార్గదర్శకాలను పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: దేవసేన
RELATED ARTICLES

