Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeక్రీడలు28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం!

📰 Generate e-Paper Clip

లిస్ట్-A క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు.. 13 సిక్సర్లు, 4 ఫోర్లతో చరిత్ర
ప్రజాసంక్షేమం న్యూస్:

ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. లిస్ట్-A క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.కేవలం 28 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్ తన అసాధారణ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు, 4 ఫోర్లు బాది ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఈ మెరుపు సెంచరీతో దక్షిణాఫ్రికా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు. చిన్న వయసులోనే రికార్డుల వేట కొనసాగిస్తున్న వైభవ్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.28 బంతులు.. 100 పరుగులు.. 13 సిక్సర్లు! వైభవ్ సూర్యవంశీ అంటేనే రికార్డుల మోత!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.